![]() |
![]() |

ఎవరు ఏ పని చేసినా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.. అలాగే డబ్బు కూడబెట్టి ఏదో ఒకటి సొంతంగా సమకూర్చుకోవాలని చూస్తుంటారు. అలా కష్టపడి కారు, బైకు, ఇల్లు వంటివి కొనుక్కుని వాటికి యజమానులు అవుతారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఆట’ సందీప్ జోడీ వచ్చేసారు. ఆట సందీప్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న డాన్సర్. పది పదిహేనేళ్ల క్రితం ఆట, ఛాలెంజ్ లాంటి షోలు ప్రతి వీకెండ్ లోనూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవి. ఆ టైంలో ‘ఆట’ ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్..తర్వాతి కాలంలో ఆట సందీప్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డాన్సర్ ఐన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం చిన్న సినిమాలు, ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న సందీప్ జోడి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాలో షార్ట్ వీడియోస్ తో డాన్సులు చేయడం ఇంటరెస్ట్ ఉన్న వాళ్లకు స్టెప్స్ నేర్పించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ జంట సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది జ్యోతి. పెద్దవాళ్ళు అన్నారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ లైఫ్ లో ఈ రెండూ చాలా కష్టం. ఐదేళ్లు కష్టపడి వన్ మాన్ ఆర్మీలా ఎన్నో కష్టాలు పడి హోప్స్ అన్నీ వదిలేసుకుని ఫైనల్ గా మాకు నచ్చిన ఇల్లు కొనుక్కున్నాం అని ఎంతో సంతోషంతో చెప్పింది జ్యోతి. ఇక మూవీ యాక్టర్ స్నేహ కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ పెట్టారు.
![]() |
![]() |